ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో వచ్చేనెల నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ - యానంలో సివిల్ సర్వీస్ శిక్షణా కేంద్రం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజ్​లో ఎమ్మెస్సీ జువాలజీ, బీఎస్సీ బోటనీ తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు.

Puducherry Health Minister Malladi Krishna Rao
పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణా రావు

By

Published : Dec 7, 2020, 2:43 PM IST


సివిల్ సర్వీస్, రైల్వే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలతో పాటు... పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా కేంద్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రారంభించనున్నట్లు పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. జనవరి ఆరు నుంచి అందుబాటులోకి తీసుకురానున్న శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజ్​లో ఈఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన.. ఎమ్మెస్సీ జువాలజీ, బీఎస్సీ బోటనీ తరగతులను ప్రారంభించిన ఆయన గడచిన పదిహేను ఏళ్లలో కళాశాలను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. చదువుతోపాటు ఉద్యోగ అవకాశాలకు తగిన శిక్షణ అందించేందుకు ప్రైవేటు సంస్థల సహకారంతో అంబేద్కర్ విజ్ఞాన భవన్​లో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details