తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రజలు నిరసనతో స్వాగతం పలికారు. రెండు రోజుల పర్వటన నిమిత్తం యానాం చేరుకున్న కిరణ్ బేడీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నల్లబుడగలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. యానాం అభివృద్ధిని అడ్డుకున్నారని, రేషన్ బియ్యం రద్దుచేశారని ఆరోపించారు. వారికి సంఘీభావంగా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి నిరసన సెగ
రెండు రోజుల పర్యటన నిమిత్తం యానాం వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి నిరసన సెగ తగిలింది. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు నల్లజెండాలు, నల్ల బుడగలతో ఆందోళన చేశారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి నిరసన సెగ
ఇదీ చదవండి:
మాజీ ఎంపీ హర్షకుమార్‌ని కలిసిన కేంద్ర మాజీ సహాయ మంత్రి పళ్లంరాజు