పుదుచ్చేరి లోక్సభ స్థానం ఫలితాల లెక్కింపు ఇక్కడే! - undefined
పుదుచ్చేరి రాష్ట్రంలోని ఏకైక లోక్సభ స్థానానికి ఎన్నికల ఓట్ల లెక్కింపు... ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో.. తూర్పుగోదావరి జిల్లా యానంలో తగిన ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు.
కేంద్రపాలిత పుదుచ్చేరిలోని ఒకే ఒక్క లోక్సభ స్థానానికి సంబంధించి.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23 న తూర్పుగోదావరి జిల్లా యానంలోని 36 వ పోలింగ్ కేంద్రంలో... ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు వేర్వురుగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫలితాలను పుదుచ్చేరిలోని ఎన్నికల సంఘానికి తెలిపేలా సువిధ యాప్ ద్వారా వివరాల నమోదుకు తగిన ఏర్పాట్లును సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర రక్షణ బలగాలకు చెందిన సిబ్బంది 24 గంటల పాటు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.