పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా.. ఉచిత మజ్జిగ పంపిణీ - అనపర్తి
విప్లవ వీరుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని అనపర్తిలో నిర్వహించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు.
'పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ'
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పుచ్చలపల్లి సుందరయ్య 34వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ కంపెనీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగను పంపిణీని చేపట్టారు. అంతకుముందు విప్లవ వీరుడి చిత్రపటానికి పూలమాల వేసి సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబి నివాళులు అర్పించారు. అనంతరం పాదచారులకు, వాహనదారులకు చల్లని మజ్జిగ వితరణ చేసి దాహార్తిని తీర్చారు.