ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధిత రైతులకు 12 టన్నుల పశుగ్రాసం అందజేత - తూర్పుగోదావరి జల్లాలో వరదలు

గోదావరి వరదల కారణంగా పశుగ్రాసం లేక అవస్థ పడుతున్న రైతులకు గడ్డిని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు... తూర్పు గోదావరి జిల్లా వాసి గుణ్నం రాంబాబు. లంక గ్రామాల ప్రజలకు 12 టన్నుల గ్రాసాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నాడు.

Provision of 12 tons of fodder to flood affected farmers in east godavari district
వరద బాధిత రైతులకు 12 టన్నుల పశుగ్రాసం అందజేత

By

Published : Aug 20, 2020, 6:15 PM IST

గోదావరి వరదలతో పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన గుణ్నం రాంబాబు... అండగా నిలిచారు. ఎండుగడ్డి అందించారు.

మండలంలోని బడుగువానిలంక, మడికి, మూలస్థానం లంకల్లోని రైతులకు 12 టన్నుల గడ్డిని పంపిణీ చేశారు. రాంబాబుకు.. రైతులంతా ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details