లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. పండించిన పంటలను కొనేవారు లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్డౌన్ తొలగింపు విషయంలో అన్ని పార్టీల నేతలు, మేధావులతో మాట్లాడి... సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలి: జ్యోతుల నెహ్రు - ఏపీ రైతులపై లాక్డౌన్ ప్రభావం
కరోనా సమయంలో రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని... తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. అన్నదాతలకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
jyothula nehru