తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్ఏలు నిరసన చేపట్టారు. కాకినాడలో నిర్వహించే ధర్నాకు మండల కేంద్రాల నుంచి ప్రదర్శనగా బయల్దేరారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి కీలకంగా ఉన్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను రూ. 18వేలకు పెంచాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.
వేతనం పెంచాలని వీఆర్ఏల నిరసన - తూర్పుగోదావరిలో జీతాలు పెంచాలని వీఆర్ఏల నిరసన
నెలసరి వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్ఏలు నిరసన చేపట్టారు.
![వేతనం పెంచాలని వీఆర్ఏల నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5047133-18-5047133-1573619337050.jpg)
వేతనాలు పెంచాలని వీఆర్ఏల నిరసన