రహదారుల పరిస్థితిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని రావులపాలెం- అమలాపురం ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక సీఎం విమానాల్లో తిరుగుతున్నారని..గుంతలమయమైన ఈ రహదారులపై ఒకసారి పాదయాత్ర చేపట్టాలన్నారు.
రోడ్లకు మరమ్మతులు చేయాలని భాజపా ధర్నా - bjp leaders agitation news
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం ప్రధాన రహదారిపై పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేక దారులన్నీ అధ్వానంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తున్నారని.. వీలైతే ముఖ్యమంత్రికి రోడ్ల దుస్థితి గురించి వివరించాలని కోరారు. వెంటనే నిధులు కేటాయించి..కనీస మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: భవిష్యత్ ఎన్నికల్లో కమలం సత్తా చాటుతుంది: సోము వీర్రాజు