ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా సమయంలో రూ.10 వేల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి' - ఆశా కార్యకర్తల డిమాండ్లు నేరవేర్చాలని నిరసన

తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో రూ.10వేల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని నిరసన చేపట్టారు.

east godavari dist
ఆశా కార్యకర్తల డిమాండ్లు నేరవేర్చాలని నిరసన

By

Published : Jun 26, 2020, 9:44 AM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలం తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆశ కార్యకర్తలను రెగ్యులర్ వర్కర్స్ గా నియమించి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా డ్యూటీలో ప్రత్యేక అలవెన్స్ 10 వేలు ఇవ్వాలని మాస్క్ లు, గ్లౌజులు, శానిటైజర్ లు, అవసరమైన మేరకు ఇవ్వాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్లకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details