తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణ ప్రదేశాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వారికి మద్దతుగా తెదేపా నాయకుడు గంగుమల్ల శ్రీనివాస్ పెట్రోల్‌తో వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. అమలాపురం సీఐ బాజీలాల్ అక్కడికి చేరుకున్నారు. పైనుంచి కిందికి దిగి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సచివాలయ భవన నిర్మాణ ప్రదేశం మారుస్తామని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హామీ ఇస్తేనే గాని కిందకి రానని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
సచివాలయ నిర్మాణ స్థలం మార్చాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన - అయిమిల్లిలో ప్రజల సమస్యలు
తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణ స్థలాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేత గంగుమల్ల శ్రీనివాస్ పెట్రోల్‌తో వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు.
సచివాలయ నిర్మాణ స్థలం మార్చాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గ్రామానికి చేరుకుని.. గ్రామస్తులు సచివాలయ భవన నిర్మాణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ వెంటనే ట్యాంక్ పైనుంచి కిందికి దిగాడు. గ్రామస్థులు చేపట్టిన దీక్షలు కూడా విరమించారు.
ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!
Last Updated : Oct 20, 2020, 9:53 PM IST