తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ.. అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మండలంలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు లోపలికి వెళ్లకుండా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివాసీల ఆందోళన విషయాన్ని ఐటీడీఎ ఏపీఓ దృష్టికి తీసుకెళ్లగా.. పది మందికి అనుమతిచ్చారు. ఆందోళనకారులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏపీఓకు అందజేశారు.
రంపచోడవరం జిల్లా ఏర్పాటుకు డిమాండ్ - రంపచోడవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు న్యూస్
రంపచోడవరంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ.. అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఐటీడీఏను ముట్టడించారు. అనంతరం కార్యలయం లోపలికి అధికారులు అనుమతించగా.. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏపీఓకు అందజేశారు.
అరకును జిల్లాగా ఏర్పాటు చేసినట్లయితే తమకు ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు. రంపచోడవరం కేంద్రంగా ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేసినట్లయితే 11 మండలాల్లోని గిరిజనులకు ప్రయోజనం ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన ఏపీఓ.. కలెక్టర్‌తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కత్తుల బాల్ రెడ్డి, పల్లాల లచ్చిరెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పదాల మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.