తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగిలింది. వాడపాలెంలో ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. దీనికి మంత్రి వేణుగోపాల్, ఎంపీ అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే గత ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో బీసీలకు కమ్యూనిటీ హాలు నిర్మించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఆందోళనకారులను శంకుస్థాపన వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనల మధ్యే ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
PROTEST: వాడపాలెంలో మంత్రి వేణుగోపాల్‌కు నిరసన సెగ... ఎందుకంటే..! - బీసీ కమిటీ హాల్
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మంత్రి వేణుగోపాల్, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, ఎంపీ అనురాధలు చేస్తున్న బీసీ కమిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినవారు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో బీసీలకు కమ్యూనిటీ హాలు నిర్మించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు.
![PROTEST: వాడపాలెంలో మంత్రి వేణుగోపాల్‌కు నిరసన సెగ... ఎందుకంటే..! నిరసన సెగ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13371749-582-13371749-1634391255879.jpg)
నిరసన సెగ
బీసీ కమిటీ హాల్ శంకుస్థాపనలో మంత్రి వేణుగోపాల్‌కు నిరసన సెగ
"గత ప్రభుత్వంలో మాకు(కాపు సామాజిక వర్గానికి), బీసీలకు కలిపి కమ్మ్యూనిటీ హాల్ కట్టిస్తామన్నారు. అందుకు స్థలాన్ని కూడా ఖరారు చేశారు. ఇప్పుడు ఇదే స్థలంలో బీసీలకు మాత్రమే హాల్ కట్టిస్తున్నారు" -ఓ మహిళ
ఇదీ చదవండి:ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీల మాయంపై కొనసాగుతున్న దర్యాప్తు.. వారి హస్తముందా..?