ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆందోళన - తూర్పుగోదావరిజిల్లా తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందంటూ... ఓ వర్గం ప్రజలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. అధికార పార్టీ మద్దతుదారులు ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని ఆరోపించారు. రీకౌంటింగ్​ కోరినా పట్టించుకోవటం లేదని.. ఆవేదన వ్యక్తం చేశారు.

Protest
ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆందోళన

By

Published : Feb 23, 2021, 3:31 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో కమిని పంచాయతీ సర్పంచికి ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన సలాది సీత అనే అభ్యర్థి గెలుపొందింది. సలాది సీత.. ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందంటూ ప్రత్యర్థి గెడ్డం పార్వతి ఆరోపించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తాను విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారని పార్వతి తెలిపింది. రెండుగంటల అనంతరం సలాది సీత 25 ఓట్లు ఆధిక్యంలో గెలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని మండల ఎన్నికల నిర్వాహణాధికారికి చెప్పినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details