ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.19.70 కోట్ల పెట్టుబడి రాయితీకి ప్రతిపాదనలు: ఉద్యానశాఖ - తూర్పుగోదావరి జిల్లా ఉద్యానశాఖ

వరుస విపత్తులతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన ఉద్యాన పంటలపై ఉద్యానశాఖ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. రైతులకు రూ.19.70 కోట్ల పెట్టుబడి రాయితీకి ప్రతిపాదనలు పంపినట్లు ఉద్యానశాఖ డీడీ రామ్మోహన్‌ తెలిపారు.

investment subsidy of Rs. 19.70 crore to horticulture farmers
రూ.19.70 కోట్ల పెట్టుబడి రాయితీకి ప్రతిపాదనలు: ఉద్యానశాఖ

By

Published : Oct 25, 2020, 4:48 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యాన రైతులను వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఆగస్టులో రెండుసార్లు గోదావరికి వరదలు.. సెప్టెంబరులో అకాల వర్షాలు.. అక్టోబరులో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కుండపోత వానలు, ఏలేరు ఉగ్రరూపం కారణంగా పంటలన్నీ నీట మునిగి నష్టపోయారు. మూడు నెలల నష్టాలను.. బాధిత రైతుల వివరాలతో ఉద్యానశాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రధానంగా అరటి, బొప్పాయి, కూరగాయలు, పూలు, కర్ర పెండలం, పసుపు, మిర్చి, ఆయిల్‌పామ్‌ తదితర పంటలు దెబ్బతిన్నాయి.

ఈ మూడు నెలల్లో 9,754.79 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 17,602 మంది రైతులు నష్టపోయినట్లు తేల్చారు. వీరికి రూ. 19.70 కోట్ల పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఉద్యానశాఖ డీడీ రామ్మోహన్‌ తెలిపారు.

  • ఆగస్టులో 4,754.57 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా.. 13,074 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ.10.35 కోట్ల పెట్టుబడి రాయితీకి ప్రతిపాదించారు.
  • సెప్టెంబరులో 192 మంది రైతులకు చెందిన 64.36 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు గుర్తించి.. రూ.9.89 లక్షలు పెట్టుబడి రాయితీని కోరారు.
  • అక్టోబరులో 4,935.86 హెక్టార్లలో పంట దెబ్బతినగా.. 4,336 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. వీరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.9.25 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details