నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై యురేనియం తవ్వకాలు వద్దంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సంతకాలు చేశారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన - students protest against mining
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4465916-thumbnail-3x2-stugupta.jpg)
యురేనియం తవ్వకాలపై విద్యార్థుల నిరసన
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
ఇదీ చూడండి : ఇవాళ 17 మృతదేహాలు లభ్యం... కొనసాగుతున్న గాలింపు