ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాశాఖ మంత్రి ప్రకటనపై ప్రైవేట్ పాఠశాలల ఐకాస ధర్నా - విద్యాశాఖ మంత్రి ప్రకటనపై కాకినాడలో మండిపడ్డ ప్రైవేట్ పాఠశాలలు

కరోనాతో చితికిపోయిన తమను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ.. ప్రైవేట్ పాఠశాలల ఐక్య కార్యాచరణ కమిటీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిరసనకు దిగింది. విద్యార్థులకు టీసీ, స్టడీ సర్టిఫికెట్లు లేకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామన్న విద్యాశాఖ మంత్రి ప్రకటనపై మండిపడింది.

private schools jac protest
ధర్నా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం
author img

By

Published : Nov 12, 2020, 7:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తోందని.. ఏపీ ప్రైవేట్ పాఠశాలల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. టీసీ, స్టడీ సర్టిఫికెట్లు లేకున్నా ప్రభుత్వ పాఠశాల్లో చేర్చుకుంటామని విద్యాశాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విద్యాలయాల యజమానులు వాపోయారు. తమ విషయంలో సర్కారు అవలంబిస్తున్న విధానాలను ఖండిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధర్నా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం

కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని యజమానులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందరికో సహాయం చేసినా.. తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చితికిపోగా.. రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆరోపించారు. విద్యార్థులకు టీసీ, స్టడీ సర్టిఫికెట్లు ఇస్తామనీ.. తమ బకాయిలను సర్కారు చెల్లించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల అధ్యాపకులకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఫీజు రీయంబర్స్​మెంట్ కోసం విద్యార్ధునులు ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details