వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు విధించడంతో ఉపాధి కోల్పోతున్నామంటూ.. తూర్పుగోదావరిలోని కాకినాడ కలెక్టరేట్ ఎదుట పూజారులు(priests) ధర్నాకు దిగారు. కొవిడ్‌తో ఇప్పటికే శుభకార్యాలు, వేడుకలు తగ్గడంతో.. జీవనాధారానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితికి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేస్తే.. తమకు భృతి దొరుకుతుందని.. ప్రభుత్వ నిర్ణయంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు.
వినాయక మండపాలకు అనుమతివ్వాలంటూ.. బ్రాహ్మణ సంఘాలు చేపట్టిన నిరసనకు భాజపా నేతలు మద్దతు తెలిపారు. ఎన్ని ఆంక్షలు విధించినా.. గణేశ్ ఉత్సవాలు జరిపి తీరుతామని స్పష్టం చేశారు.