నర్సరీలు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉండే గ్రామం.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మాధవ రాయుడుపాలెం. ఊరంతా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ. పేదలకు కాలనీలు, ఉన్నత పాఠశాల, ఆలయాలు.. వంటి సౌకర్యాల్లో లోటు లేని గ్రామం అది. వీటిని సమకూర్చింది, ప్రజల అవసరాలు తీర్చింది ఓ వ్యక్తి. గ్రామస్తులకు ఎళ్ల వేళలా అండగా ఉండే నాయకుడు, అందుకే ఆ ఊరి జనం ఎప్పుడూ ఆయన వెంటే నడిచారు.. నడుస్తున్నారు. అతనే.. అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ అలియాస్ చంటి. ఊరంతా ప్రసిడెంట్ చంటిగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1988 నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన, ఆయన పోటీలో నిలిపిన అభ్యర్థుల్నే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు.
జనం ఒత్తిడితో ఆఖరి నిమిషంలో నామినేషన్..
యువకుడిగా అనూహ్య పరిస్థితుల్లో 33 ఏళ్ల క్రితం సర్పంచ్ గా నెగ్గించుకున్న ప్రజలు.. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన వెంటే నిలిచారు. యువకులకు అవకాశం కల్పించాలని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినా.. జనం ఒత్తిడితో ఆఖరి నిమిషంలో నామినేషన్లు వేశారు. తీవ్ర పోటీలోనూ మరోసారి మాధవరాయుడుపాలెం సర్పంచ్ గా విజయం సాధించి సత్తా చాటారు.
33 ఏళ్ల ప్రస్థానంలో ఓటమి ఎరుగని వ్యక్తి..