అంబరాన్నంటిన సంక్రాంతి సంబారాలు PreSankranti Celebrations Across AP:రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల నిర్వహణతో రెండు రోజులు గానే ముందుగానే సంక్రాంతి వాతావరణం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో కళాశాలల విద్యార్దులు, మహిళలు ముగ్గులు వేస్తూ నృత్యాలు చేస్కూ సందడి చేశారు. భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, పొంగళ్లు, రంగవళ్లులు, భోగిపళ్లతో సంక్రాంతి సంబరాలు మన సంస్కృతిని ప్రతిబింభించేలా సాగాయి. తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతిని గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
Eluru District:ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భోగి మంట వేసి నృత్యాలు చేస్తూ మహిళలు సందడి చేశారు. రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Dr. BR Ambedkar Konaseema District:అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పాటలు పాడుతూ సందడి చేశారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ప్రభలను గ్రామంలో ఊరేగించారు.
Anakapalli District:అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి హవా రద్దీగా మారిన రహదారులు - కీసర టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిన వాహనాలు
Visakhapatnam:విశాఖలోని ఎస్బీఐ జోనల్ కార్యాలయం ఆవరణలో పండుగ శోభ ప్రతిబింబించేట్టుగా ఏర్పాటు చేసిన గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో తప్పెటగుళ్లు, కోలాటాలు, పులివేషాలు, సంక్రాంతి ముగ్గులతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం కళకళలాడింది.
Vizianagaram:సంక్రాంతి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా విజయనగరంలో మైత్రీ మీడియా సంక్రాంతి సంబరాలు పేరిట రంగవల్లులు, ఆటపోటీలు నిర్వహించాయి. కోలాటం, దాండియా నృత్యాలు, ఫ్యాషన్ డ్రెస్ పోటీలతో చిన్నారులు కనువిందు చేశారు. విజేతలకు బంగారు బహుమతులను అందజేశారు.
Annamaya District:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో జనసేన నాయకులు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నగదు, చీరలు అందజేశారు.
పాఠశాలల్లో సంక్రాంతి కోలాహలం- రంగవల్లులు, ఆటపాటలతో విద్యార్థుల సందడి
Chittoor District:సంక్రాంతి పండుగను చిత్తూరు ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలంటూ టీడీపీ నేత గురజాల జగన్మోహన్ నాయుడు 42 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించారు.
Nellore District:పిండివంటలు తయారీ కోసం నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నెల్లూరు, కావలి, కందుకూరులోని దుకాణాలు కిటకిటలాడాయి.
Guntur:అయోధ్యలో ఈనెల 22న జరిగే రామమందిర ప్రారంభం సందర్భంగా గుంటూరులోని మహిళలు ఇంటింటికీ తిరిగి అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలలో శ్రీరాముని సేవను మిళితం చేసి తాంబూలాలు పంచుతున్నారు.