ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు సన్నాహాలు - yanam Deputy Collector Shivraj Meena news

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఫైనల్​ రిహార్సల్​ కార్యక్రమం నిర్వహించారు.

Preparations for the Republic Day celebrations
గణతంత్ర వేడుకల నిర్వహణకు సన్నాహాలు

By

Published : Jan 24, 2021, 12:36 PM IST

కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇందుకోసం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు.

కొవిడ్ నిబంధనల కారణంగా స్థానిక పోలీస్, ఐఆర్​బీ, మహిళా పోలీస్, హోంగార్డుల విభాగాలకు చెందిన వారు మాత్రమే పరేడ్​లో పాల్గొననున్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పరేడ్​లో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. పోలీసు విభాగానికి చెందిన వారు మాత్రమే ఫైనల్ రిహార్సల్స్​ చేశారు. ఏర్పాట్లను యానాం ఎస్పీ భక్తవత్సలం, సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేశ్​ పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details