కోడిపందేల కోసం పందెంరాయుళ్లు కోళ్లను ఏడాది పాటు తర్ఫీదు ఇస్తూ... పెంచుతారు. అనారోగ్యం బారిన పడకుండా వాటికి వ్యాక్సిన్లు, మందులు వేయిస్తారు. వేడి నీటితో స్నానం, ఈత, వ్యాయామం లాంటివి చేయిస్తారు. చిరుధాన్యాలతో పాటు బాదం, పిస్తా, మేక ఖీమా లాంటి ఆహారాన్ని పెడతారు. మెట్ట ప్రాంతంలో కొంతమంది స్థానిక నాయకులే దగ్గరుండి పందేలు నిర్వహిస్తారు. ఈ పందేల్లో విదేశీ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తారు.
సంక్రాంతి వస్తోంది... కోడిపందేల్ని తెస్తోంది..! - గోదావరి జిల్లాల్లో కోడిపందేలు
సంక్రాంతి అంటే కోడిపందేలు. పందేలంటే గోదావరి ప్రాంతాలు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సమీపించటంతో మెట్టప్రాంతంలో పందెంరాయుళ్లు తమ కోళ్ల నైపుణ్యానికి పదునుపెడుతున్నారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ... పందెంరాయుళ్ల ప్రయత్నాలు ఆగడంలేదు.
కోడిపందేలు