ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోరిపోడులో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు - తూర్పుగోదావరిజిల్లా తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో కొవిడ్ చికిత్స ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. స్థానిక ఆసుపత్రిని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌషిక్ పరిశీలించారు.

sub collector
సబ్ కలెక్టర్ హిమాన్సు కౌషిక్

By

Published : May 4, 2021, 4:48 PM IST

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడు రివర్ సైడ్ సుబ్బమ్మ క్రిస్టియన్ హాస్పిటల్ ను.. కొవిడ్ చికిత్సా ఆసుపత్రిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆసుపత్రిని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌషిక్ పరిశీలించారు. కరోనా చికిత్స అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకు వచ్చారన్నారు.

ప్రస్తుతం సుమారు 40 పడకలతో ఈ ఆసుపత్రి ఉందని 100 పడకల ఏర్పాటుకు అవసరమైన వసతులు.. అంశాలను పరిశీలించామని చెప్పారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా.. ఈ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details