ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాలం.. ప్రసవం కోసం 460 కిలో మీటర్ల ప్రయాణం!

కరోనా మహమ్మారి గర్భిణులకు శాపంగా మారింది. కొవిడ్ సోకిన గర్భిణులకు ప్రసవం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ గర్భణిని అమలాపురం నుంచి హైదరాబాద్‌కుఆసుపత్రిలో చేర్పించేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

pregnant lady travelled for 460 km for delivery
pregnant lady travelled for 460 km for delivery

By

Published : May 19, 2021, 6:40 AM IST

మాయదారి కరోనా మానవలోకాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రసవం కోసం ఓ నిండు గర్భిణి సుమారు 460 కిలోమీటర్లు.. ప్రయాణించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఓ గర్భిణి (23)కి నెలలు నిండడంతో ప్రసవం కోసం సోమవారం స్థానికంగా ఆసుపత్రికి వెళ్లారు. కొవిడ్‌ పరీక్ష చేయించుకుని రావాలని అక్కడి వైద్యులు సూచించారు. పరీక్షలో పాజిటివ్‌ అని తేలింది. ప్రసవం కోసం తొలుత సంప్రదించిన ఆసుపత్రితో పాటు అమలాపురం, కాకినాడలోని అన్ని ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా చేర్చుకోలేదు. చివరికి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి చేర్చుకునేందుకు ముందుకొచ్చింది.

గర్భిణికి అనస్తీషియా ఇచ్చినా మత్తు రావడం లేదని గుర్తించిన వైద్యులు రక్తపరీక్షలు చేశారు. రక్తంలో సీఆర్‌పీ స్థాయి ఎక్కువ ఉందని.. ప్రసవం చేయలేమని చెప్పి హైదరాబాద్‌ తీసుకెళ్లాలని ఓ ఆసుపత్రిని రిఫర్‌ చేశారు. కుటుంబీకులు హుటాహుటిన రూ.80 వేలు కట్టి ఓ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. మంగళవారం ఉదయం 7.30కు ఆసుపత్రికి చేరుకున్నారు. వారు తాము చికిత్స చేయలేమని, మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.

రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులను సంప్రదించగా ఒకరు కొవిడ్‌ పూర్తిగా తగ్గాక డెలివరీ చేస్తామని, మరో ఆసుపత్రిలో రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో కుటుంబీకులు వెనకంజ వేశారు. మధ్యాహ్న సమయంలో అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి, ఓ ఆసుపత్రి యాజమాన్యం చొరవ చూపి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్‌ ఇప్పించారు. బుధవారం ఉదయం కాన్పు అయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి.. సీల్డ్ కవర్​లో సుప్రీంకు నివేదిక

ABOUT THE AUTHOR

...view details