తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.మంజువరం ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో అంకాని వెంకటలక్ష్మి ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల నడుస్తోంది. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా కొవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. వైరస్ బాధితులకు ధైర్యం చెబుతూ.. అవసరమైన వారిని ఆసుపత్రులకు పంపించడంలో వెంకటలక్ష్మి క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి మందులు పంపిణీ చేయడం.. వైద్యులకు నివేదికలు ఇవ్వడం వంటి పనులు బాధ్యతగా చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తేనే నిజమైన సంతృప్తి అని అంటున్నారు ఏఎన్ఎం వెంకటలక్ష్మి.