తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ అద్దరివలస గ్రామానికి చెందిన సాధల భాను కుమారి అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆటోలో సమీపంలోని బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో కొండ వాగు పొంగింది. దీంతో కర్రలతో జడ్డి కట్టి గర్భిణీని వాగు దాటించారు. వాగు దాటించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రసవం కోసం... కర్రల సాయంతో వాగు దాటించారు! - east godavari rains
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లి మండలానికి చెందిన ఓ గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెకు బోదులూరు ఆసుపత్రికి తీసుకువస్తుండగా దారిలో కొండవాగు పొంగింది. దీంతో మహిళ జడ్డిపై కూర్చొపెట్టి వాగు దాటించారు.
పురిటి నొప్పులతో గర్భిణీ అవస్థలు...కర్రల సాయంతో వాగుదాటించిన వైనం