ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

తూర్పుగోదావరి జిల్లాకు అత్యంత సమీపంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా కట్టడికి చర్యలు వేగవంతం చేశారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించి సదుపాయాలపై ఆరా తీశారు.

యానాంలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు
యానాంలో కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

By

Published : Apr 25, 2020, 11:51 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో లాకౌడౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాసుపత్రిలో రెండు విభాగాలను ప్రత్యేక వార్డులుగా కేటాయించారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details