లాయర్ పైలా చంద్రబోస్ అరెస్టును తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యలు ఖండించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుగత శివ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, న్యాయవాది సుభాష్, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు వేధింపులు ఆపేయాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే బోస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లాయర్ చంద్రబోస్‌ను తక్షణమే విడిచి పెట్టాలనీ... లేదంటే ఇతర ప్రాంతాల న్యాయవాద అసోసియేషన్లతో కలిసి నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
న్యాయవాది చంద్రబోస్ అరెస్టును ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంకు చెందిన న్యాయవాది పైలా చంద్రబోసు అరెస్టుకు నిరసనగా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. లాయర్‌ను వెంటనే విడుదల చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
న్యాయవాది చంద్రబోస్ అరెస్టును ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్