తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం కంబాల పాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారిని ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా పరామర్శించారు. నాలుగు రోజులు కిందట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలతో మాట్లాడారు. ఏలేరు నదీ తీరంలో జీవించే వీరి వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి పడవలపై వెళ్లారు.
చేపల వేటే జీవనోపాధిగా బతికే ఆ బాధితుల వలలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి కాగా.. వారికి బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని రాజా అందజేశారు. లక్షల రూపాయలు విలువ చేసే వలలతో పాటు సర్వం కోల్పోయిన ఈ పేదల కుటుంబాలను.. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి చెందిన యాకోబు అనే మత ప్రచారకుడు.. రూ. 2 లక్షలు విలువైన గృహోపకరణాలను బాధితులకు పంపిణీ చేశారు