Prakara Seva at Annavaram: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రాకార సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి.. ప్రధానాలయ ప్రాకారం చుట్టూ మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మూడుసార్లు ఊరేగించారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది. నూతన సంవత్సరం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Annavaram: చూడముచ్చటగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
Prakara Seva at Annavaram: అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రాకార సేవ ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై మూడు సార్లు ఊరేగించారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది
Prakara Seva at Annavaram