..
9 నెలలలోనే ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది - తెదేపా ప్రజా చైతన్య యాత్ర
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలలోనే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తెదేపా నేత వరుపుల రాజా అన్నారు. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి, ఏలూరు, జగన్నాథపురం గ్రామాల్లో తెదేపా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేశారు. యాత్రలో భాగంగా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను శుభ్రపరిచారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండింటిని విజయవంతంగా అమలు చేశారని రాజా అన్నారు.
శిలఫలకాలను శుభ్రం చేస్తున్న వరుపుల రాజా