తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలు కనువిందుగా సాగాయి. రాత్రివేళల్లో ప్రభల తీర్థాలకు భక్తజనం పోటెత్తారు. గ్రామాల నుంచి ప్రజలు తీర్థాల వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో తీర్థాలకు వెళ్లి ప్రభల వద్ద పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య ప్రభలు దేదీప్యమానంగా కాంతులీనుతూ దర్శనమిచ్చాయి.
కోనసీమ ప్రభల తీర్థాలకు పోటెత్తిన భక్తజనం - ప్రభల తీర్థాలు
ప్రభల ఊరేగింపుతో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభలను చూసేందుకు రాత్రివేళల్లో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రభల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
prabhalu theerthalu in konaseema