కోనసీమలో కన్నులపండువగా ప్రభల తీర్థాల ఊరేగింపు - తూర్పుగోదావరి జిల్లాలో ప్రభల తీర్థాల ఊరేగింపు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా.. కనుమ సందర్భంగా ప్రభల తీర్థాలను ఊరేగించారు. 175 గ్రామాల్లో ప్రభల తీర్థాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కొత్తపేట మండలం ఆవిడి, రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో పలు ఆలయాలకు చెందిన కమిటీలు దేవతామూర్తుల అలంకరణ నిమిత్తం పెద్ద పెద్ద ప్రభలు తయారు చేశారు. పుష్పాలతో అందంగా అలంకరించి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను వాటిపై పెట్టారు. బాణసంచా డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. ఆయా గ్రామాలకు చెందిన దేవతామూర్తులను ప్రభలపై ఉంచి రెట్టించిన ఉత్సాహంతో యువత వాటిని భుజాన ఎత్తుకుని తరలించిన తీరు కనువిందు చేసింది. రాత్రి వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
కోనసీమలో ప్రభల తీర్థాల ఊరేగింపు