ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేటలో ఘనంగా ప్రభల ఊరేగింపు - kothapeta prabhala news

సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేకమైన ప్రభల ఊరేగింపు కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వైభవంగా ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లోనూ కనుమ రోజున ప్రభల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కానీ.. కొత్తపేటలో మకర సంక్రాంతి రోజునే వేడుక జరగడం ప్రత్యేకత.

prabhala celebrations in east godavari district
కొత్తపేటలో ఘనంగా ప్రభల ఊరేగింపు

By

Published : Jan 14, 2021, 8:38 PM IST

కొత్తపేటలో ఘనంగా ప్రభల ఊరేగింపు

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభల ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. కొత్త రామాలయం, పాత రామాలయం ఆధ్వర్యంలో రెండు విభాగాలుగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల వద్ద ప్రత్యేకంగా 12 ప్రభలను తయారు చేశారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ప్రభలపై దేవతామూర్తుల విగ్రహాలను పెట్టి డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల నడుమ యువకులు ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు.

బోడిపాలెం వంతెన నుంచి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు యువకులు కేరింతలతో భుజాలపై మోసుకుంటూ ఊరేగింపుగా కళాశాల ప్రాంగణంలో ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని సరదాగా ప్రభల వద్ద ఫోటోలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details