తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. జిల్లాలోని 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 సామాజిక ఆసుపత్రులు, 23 అర్బన్ హెల్త్ సెంటర్లలో పీపీఈ కిట్లను, ఎన్-95 మాస్కులను అందజేశారు.
ఒక్కో ఆస్పత్రికి 10 చొప్పున వీటిని కేటాయించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి సత్య సుశీల తెలిపారు. వైద్యులకు, సిబ్బందికి రక్షణ సామాగ్రి కొరత లేకుండా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.