వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా వైరస్ ప్రభావం నుంచి రక్షణ కల్పించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న పీపీఈ సూట్స్ తయారీ వేగంగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్ ప్రాంతంలో ఉన్న పాల్స్ ప్లస్ బొమ్మల పరిశ్రమలో ఈ పీపీఈ సూట్లుల తయారీ జరుగుతోంది. 400 మంది టైలర్లతో గత పది రోజులుగా విరామం లేకుండా సూట్లు తయారీ చేస్తున్నారు. ఇప్పటికే 25 వేల సూట్లు తయారుచేసి ఉభయ గోదావరి జిల్లాలకు అందించినట్లు పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింహా తెలిపారు. రోజు రోజుకి వీటి తయారీ వేగంగా జరుగుతోందని, వారానికి 25 వేల సూట్లు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వేగంగా జరుగుతున్న పీపీఈ సూట్ల తయారీ - ap ppe kits in
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ ప్రాంతంలో ఉన్న పాల్స్ ప్లస్ బొమ్మల పరిశ్రమలో పీపీఈ సూట్ల తయారీ వేగంగా జరుగుతోంది. వారానికి 25 వేల సూట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలో పీపీఈ సూట్లు అందించారు.
వేగంగా జరుగుతున్న పీపీఈ సూట్ల తయారీ