తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని వాకలపూడిలో ఓ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని ప్రైవేటు బ్రాండ్ సంచుల్లో నింపి తరలించడానికి సిద్ధమవుతున్న క్రమంలో తనిఖీ చేశారు. 127 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవిందరాజు తెలిపారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయాన్ని పౌరసరఫరాల శాఖకు సమాచారం అందించడంతో ఆ శాఖ జిల్లా అధికారులు పరిశీలించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం - కాకినాడ కరోనా కేసులు
అక్రమంగా నిల్వ ఉంచిన 127 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ration rice