మహా శివరాత్రికి ఏర్పాట్లు మహాశివరాత్రికి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ద్రాక్షారామం, కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం, పంచారామ ప్రథమ క్షేత్రమైన శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి.ద్రాక్షారామానికివేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులకు ఉచితంగా పాలు, పెద్దవారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించేందుకు సమాయత్తమయ్యారు. తీర్థ ప్రసాదాలకు లోటు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.