రాజమహేంద్రవరం శేషయ్యమెట్టలోని రహదారి పక్కనే ఓ పాత ఆటో ఉంది. అందులోకి తొంగి చూస్తే మూలుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ మహిళ కనిపిస్తుంది. లేవలేని స్థితిలో బక్కచిక్కి ఉన్న ఆమె పేరు రాజేశ్వరి. గతంలో వీరి కుటుంబం మేదరపేటలో నివాసం ఉండేది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడం వల్ల ఆమె దిక్కులేనిదైంది. రాజేశ్వరికి మిగిలింది తన అత్త మాత్రమే. వయసు మీద పడడం వల్ల ఆమెకు కూడా చూపు మందగించింది. ఉన్న కొద్దిపాటి ఓపికతోనే తన కోడలికి చేతనైనంత సాయం చేస్తూ... ఆమె కూడా అక్కడే నివసిస్తోంది. స్థానికులు ఎవరైనా జాలిపడి ఆహారం అందిస్తే రాజేశ్వరి తింటుంది. లేకుంటే పస్తులుంటుంది. కొందరు మహిళలు ఆమె దుస్థితి చూసి తోచిన సహాయం చేస్తున్నారు.
సహాయం కోసం ఎదురుచూపులు