కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈరోజు సాయంత్రం యానాం చేరుకోనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పుదుచ్చేరి ఐజీ సురేంద్ర కుమార్ యాదవ్, ఎస్పీ రాహుల్ ఆల్వాల్ గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాయం, అతిథి గృహాలను బాంబు, డాగ్స్ స్క్వాడ్లతో తనిఖీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్స్టేషన్ల పనితీరును పరిశీలించారు.
యానాంలో కిరణ్‌బేడీ పర్యటన..ఏర్పాట్లు పూర్తి - పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పర్యటించనున్నారు
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ రెండు రోజులు యానాంలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
కిరణ్ బేడీ రాకకు యానాం అధికారుల ఏర్పాట్లు