కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన నారాయణస్వామికి పోలీసు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు ఇంటికి వెళ్లి... ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కృష్ణారావు స్వగ్రామమైన దరియాలతిప్పలో మల్లాది సూర్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
యానాంలో పర్యటించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి - పుదుచ్చేరి సీఎం యానాం పర్యటన
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి యానాంలో పర్యటించారు. పితృవియోగం పొందిన ఆరోగ్య శాఖ మంత్రి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించి... వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కేంద్రపాలిత ముఖ్యమంత్రి యానాం పర్యటన