కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు, పుష్ప ప్రదర్శనను ప్రారంభించనున్నారు. 27 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లింకింగ్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్... రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం... 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవుల్లో విహరించేందుకు రూ.10 కోట్లతో నిర్మించిన ఉడెన్ వాక్ వే లను సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు. సాయంత్రం స్థానిక జీ. ఎం. సి. బాలయోగి క్రీడా ప్రాంగణంలో 18వ యానాం ప్రజా ఉత్సవాలు, 21వ ఫల పుష్ప ప్రదర్శన ముఖ్యమంత్రి మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
యానాంలో పర్యటించనున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి - pondicherry cm 2 days visit to yanam
పలు అభివృద్ధి పనులు, పుష్ప ప్రదర్శనను ప్రారంభించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రెండు రోజుల పాటు యానాంలో పర్యటించనున్నారు.
యానాంలో పర్యటించనున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి