కేంద్రపాలిత పుదుచ్చెరి రాష్ట్ర అసెంబ్లీకి చెందిన 30 నియోజకవర్గాల్లో ఈ నెల 6న ఎన్నికల జరిగాయి. దానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 2న జరుగనుంది. ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పుదుచ్చేరి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. యానంలో అధికారులు పనులు చేపట్టారు. లెక్కింపు జరిగే కార్యాలయంలో పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు రోజు ప్రజలు ఓట్ల కార్యాలయానికి 100మీటర్ల పరిధిలోకి రాకుండా ఉండేందుకు పలు రహదారుల మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. నెగటివ్ రిపోర్టుతో వచ్చిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు.
యానాంలో.. పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు - pondicherry assembly elections counting in yanam
కేంద్రపాలిత పుదుచ్చెరి రాష్ట్రంలో ఈ నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 2న జరుగనుంది. ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పుదుచ్చేరి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. యానంలో అధికారులు పనులు చేపట్టారు.

yanam