ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిని శుద్ధి చేస్తున్నా.. ఆ గ్రామ ప్రజలకు మంచి నీరు అందని ద్రాక్షే - తరంగిలో సమగ్ర రక్షిత మంచి నీటి సరఫరా పథకం తాజా వార్తలు

మంచినీరు, స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంటే అనారోగ్యాలకు ఆమడ దూరంలో ఉండవచ్చు. ఈ ఉద్దేశంతోనే.. ఆ 7 గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఓ పథకం చేపట్టారు. కానీ నీటిని శుద్ధి చేస్తున్నా.. మంచి నీరు మాత్రం ప్రజలకు అందడం లేదు. ఎందుకు తెలుసుకోవాలంటే కాకినాడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లాల్సిందే.

polluted water in sri venkateswara drinking water canal
రక్షిత చెరువులోకి మురుగు నీరు

By

Published : Feb 26, 2021, 10:42 PM IST

రక్షిత చెరువులోకి మురుగు నీరు

కాకినాడ గ్రామీణ మండలంలోని తూరంగి బుల్లబ్బాయిరెడ్డి నగర్ కాలనీలో మూడేళ్ల క్రితం 18 కోట్ల రూపాయలు వెచ్చించి సమగ్ర రక్షిత మంచి నీటి సరఫరా పథకం నిర్మించారు. తూరంగి, రాజుల తూరంగి, అల్లూరి సీతారామరాజు నగర్, ఉప్పలంక, పగడాలపేట, గురజానాపల్లి, నడకుదురు పాతర్లగడ్డ గ్రామాలకు ఈ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇందుకోసం చెరువు నిర్మించారు. ఈ చెరువులోకి పెనుగుదురు నుంచి పైపుల ద్వారా గోదావరి జలాలు తరలించి.. శుద్ధి చేసిన జలాలను ఆయా గ్రామాలకు సరఫరా చేయాలి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

రక్షిత చెరువులోకి మురుగు నీరు..

పంట కాలువలో రసాయనాలు, సమీప ప్రాంతాల్లోని ఆవాసాల నుంచే మురుగు నీటిని రక్షిత చెరువులోకి నింపుతున్నారు. చెరువు నిర్వహణ అధ్వానంగా మారింది. నాచు, మురుగు తెట్టలు కట్టాయి. కాలుష్యకాసారంగా మారిన నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగిన ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 7 గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అధికారులు ఇప్పటికైనా స్పందించాలంటున్న ఏడు గ్రామాల ప్రజలు.. కలుషిత నీటి నుంచి విముక్తి కల్పించి.. మంచినీరు అందించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

నిరుపయోగంగా మారిన ఈ-ఆటోలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details