రెండు మట్టి లారీలను సీజ్ చేసిన పోలీసులు - ravulapalem latest news
అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా లారీలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాల కోసం రావులపాలెం నుంచి బొండు మట్టిని దేవరపల్లికి తరలిస్తున్నారు. ఈక్రమంలో దేవరపల్లి వైపు వెళ్లకుండా రెండు లారీలు ఆలమూరు వైపు వెళ్తుండటంతో తెదేపా నాయకులు ఆ లారీలను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద తమ కార్యకర్తలపై ఒక పోలీసు అధికారి దురుసుగా మాట్లాడారంటూ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.