గంజాయి విక్రయిస్తున్న పది మందిని తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. సఖినేటిపల్లి మండలం పెద్దలంకకు చెందిన ఎన్ హనుమంతు, అంతర్వేదికి చెందిన సీహెచ్. పాల్సన్ ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానిక యువకులకు విక్రయిస్తున్నారు. మలికిపురం మండలం దిండి బ్రిడ్జి దిగువన వారిద్దరితో పాటు మరో ఎనిమిది మంది గంజాయి అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. అనంతరం రాజోలు కోర్టులో హాజరు పరిచారు. పది మందిలో ముగ్గురు మైనర్లు ఉండటంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. వీరి నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాజోలులో గంజాయి పట్టివేత, 10 మంది అరెస్ట్ - Police seized marijuana in Rajolu
గంజాయి విక్రయిస్తున్న పది మందిని తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. పది మందిలో ముగ్గురు మైనర్లు ఉండటంతో పోలీసులు వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
రాజోలులో గంజాయి పట్టివేత