హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా తునికి రవాణా చేస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
సరఫరా చేసేందుకు వ్యాన్‌లో సిద్ధంగా ఉన్న సుమారు రూ. 12.48 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సయ్యద్ అసఫక్ అలీ, షేక్ అమీర్ ఫిరోజ్ అరెస్ట్ అయ్యారు.