తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురంలో మూడు రోజులుగా కోడి పందాలు, జూదం, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొంతమంది ఫిర్యాదు మేరకు అడ్డతీగల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఎనిమిది ద్విచక్రవాహనాలు, మూడు కార్లతో పాటు ఆటోను సీజ్ చేసినట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. వారి నుంచి 6వేలు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వేలల్లో పట్టుబడినప్పటికీ ఇక్కడ లక్షల్లో బెట్టింగ్ జరుగుతోందన్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుందని స్థానికులు కొందరు ఆరోపిస్తున్నారు.
తిమ్మాపురంలో పోలీసుల తనిఖీలు.. - ఈరోజు తిమ్మాపురంలో పోలీసులు దాడులు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో మూడు రోజులుగా అసాంఘిక కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొంతమంది ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తిమ్మాపురంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు