ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్ద ఎత్తున నాటుసారా స్థావరం.. పోలీసులే అవాక్కయ్యేలా!

గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్న ఓ భారీ స్థావరాన్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. దాదాపు మూడు టన్నుల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

illegal id liquor production
పెద్ద ఎత్తున నాటుసారా స్థావరం

By

Published : Mar 18, 2021, 10:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండల సమీపంలోని ఓ ప్రదేశంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నాటుసారా స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్​ఫోర్స్మెంట్​ అధికారులు వెల్లడించారు.

150 లీటర్ల సారాతో పాటు.. 5 వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 120 ఖాళీ డ్రమ్ములతో పాటు.. సారా ఉత్పత్తి కోసం డీజీల్​ మోటార్ల సహాయంతో వేసిన పైప్​లైన్​ను పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో నలుగురు నిందితుల్ని పట్టుకున్నారు. ఓ బైక్​ను సీజ్​ చేశారు.

నాటుసారా స్థావరం

పోలీసులే అవాక్కయేలా..

భారీ మొత్తంలో నాటుసారా తయారు చేస్తున్న విధానాన్ని చూసి పోలీసులు నివ్వెరపోయారు. రోజుకు దాదాపు వెయ్యి లీటర్ల నాటుసారాను ఉత్పత్తి చేసేలా తయారు చేసిన ఏర్పాట్లను పోలీసులు భగ్నం చేశారు. రోజుకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా నిర్వాహకులు వీటిని ఏర్పాటు చేశారని తెలిపారు. నీటి సరఫరా కోసం 800 మీటర్ల పొడవునా వాటర్ పైపులైనుతో పాటు.. ఒక డీజిల్ ఇంజీన్​ను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:ప్రైవేట్ బస్సులో గంజాయి పట్టివేత... ఒకరు అరెస్ట్, మరొకరు పరార్

ABOUT THE AUTHOR

...view details