లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొంతమంది ఆకతాయిలు పట్టించుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో మధ్యాహ్న సమయంలో కొందరు ద్విచక్ర వాహనాలపై ఆకతాయిగా తిరుగుతున్నారు. గమనించిన ఎస్సై హరికోట శాస్త్రి.. వారికి గుణపాఠం చెప్పారు. వారిచేత గుంజీలు తీయించారు.
బయటకు రావొద్దంటే వినరు కదా.. మీకు ఇదే శిక్ష!
కరోనా మహమ్మారి మనల్ని చంపేస్తుంది. బయటకు రాకండి. వస్తే మీకు.. మీ కుటుంబానికి ప్రమాదం అని పోలీసులు నెత్తి నోరూ మొత్తుకొని చెప్పినా కొందరు ఆకతాయిలు వినటంలేదు. కనీస జాగ్తత్తలు పాటించడం లేదు. అందుకే పోలీసులు వారికి ఇలా బుద్ధి చెప్పారు.
police punished the people who violated the lockdown at ravupalem in eastgodavari