అక్రమంగా ఆవులు తరలిస్తున్న రెండు వ్యాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో సంరక్షణా సమితి సభ్యులు అందించిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయరహదారిపై వారిని అడ్డుకున్నారు. ఒక డ్రైవర్ పారిపోగా.. మరో డ్రైవర్ను అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు. హనుమాన్ జంక్షన్ నుంచి ఒడిశాకు ఆవులను తరలిస్తున్నారని చెప్పారు. వాహనాల్లో పదమూడు ఆవులు, ఏడు ఎద్దులు, ఒక దూడ ఉన్నాయన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆవులను రాజమహేంద్రవరంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు.
అక్రమ ఆవుల తరలింపు అడ్డుకున్న పోలీసులు - illegal movement of cows news
అక్రమంగా ఆవులు తరలిస్తున్న వ్యాన్లను గో సంరక్షణా సమితి సభ్యులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జాతీయరహదారిపై పోలీసులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా వ్యానులో తరలిస్తున్న ఆవులు